BREAKING : ఇవాళ బిజెపిలో చేరనున్న జయసుధ

-

ప్రముఖ సీనియర్ నటి.. సహజ నటి గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఆమె 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు పోషించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

నాటి నుంచి నేటి వరకు ఎన్నో పాత్రలు పోషిస్తూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమై మరింత పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ సీనియర్ నటి జయసుధ..ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర బీజేపీ పెద్దల సమక్షంలో ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్టీ కండువా వేసుకోనున్నారు జయసుధ. కాగా.. ముషిరా బాద్‌ నుంచి ఎమ్మెల్యేగా జయసుధ…బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version