ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. నేటి నుంచి ఏపీలో ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.. ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 1వ తేదీన తరగతులు పునః ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ విద్యలో సంస్కరణల తరువాత ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది
ఏపీ ఇంటర్ బోర్డు. ఈ నెల 7వ తేదీ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ కాలేజీల తరహాలో అడ్మిషన్ల కోసం ప్రభుత్వ కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.