మా నాన్నకి అలాంటి అల్లుడు కావాలట : జాన్వీ కపూర్

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎన్నో అంచనాల మధ్య వెండితెరపైకి అడుగుపెట్టిన తార జాన్వీకపూర్. దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తండ్రి బోనీకపూర్‌ కూడా జాన్వీ కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. పిల్లలకు తల్లిలేని లోటు లేకుండా గారాబంగా చూసుకుంటున్నారు.

ఎప్పటికైనా జాన్వీని ఓ ఇంటికి పంపాల్సిందే కదా. మరి ఎలాంటి అల్లుడు కావాలో ఆయన ఎప్పుడూ తన మనసులో మాట చెప్పలేదు. కానీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని తన తండ్రి అనుకుంటున్నారో బయటపెట్టింది జాన్వీ.


ఇటీవల ఓ టెలివిజన్‌ షోలో ఆమె మాట్లాడుతూ ‘‘మా నాన్నకు మిగిలిన విషయాలు ఎలా ఉన్నా సమస్యలేదు. కానీ నాకు కాబోయే వాడు నాన్న కంటే పొడుగ్గా ఉండాలట. నాన్న ఎత్తు 6.1 అడుగులు’’అని సరదాగా నవ్వేసింది.

బోనీ ఇంకో మాట కూడా తన కూతుళ్లతో అంటుంటారట. ‘‘జాన్వీ…ఖుషీ మీ భర్తలతో ఒకటే చెప్పండి.. ‘మా నాన్న ప్రపంచం మొత్తం తిప్పి చూపించాడు అని’. అంటే నా భర్త నన్ను ఇంకెంత బాగా చూసుకోవాలో నాన్న చెప్పకనే చెప్పారు’’అంటూ మనసులో మాటను పంచుకుంది జాన్వీ. ఆమె ఇటీవల నటించిన ‘గుడ్‌ లక్‌ జెర్రి’ ఇవాళ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version