మరో పెళ్లితో ఝాన్సీకి షాక్ ఇచ్చిన జోగినాయుడు

-

యాంకర్ గా సుమతో పాటుగా ఈక్వల్ ఇమేజ్ సంపాదించింది ఝాన్సీ. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ వల్ల ఆమె కాస్త వెనక్కి తగ్గింది. జోగి బ్రదర్స్ షోతో పాపులర్ అయిన జోగి నాయుడుని ప్రేమించి పెళ్లాడిన ఝాన్సీ ఒక పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఝాన్సీ, జోగి నాయుడు విడాకులు తీసుకున్నారు. తల్లి దగ్గరే ఉండాలని చెప్పగా వారికి పుట్టిన పాప ఝాన్సీ దగ్గరే పెరుగుతుంది.

జోగి నాయుడు అడపాదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఈరోజు సడెన్ గా జోగి నాయుడు మరో పెళ్లి చేసుకున్నాడు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో జోగి నాయుడు తన ఊరు చెర్లోపాలెంకు చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. ఎలాంటి హంగామా లేకుండా ఈ పెళ్లి జరిగింది. అమ్మాయి సౌజన్యది జోగి నాయుడి సొంత ఊరే కావడం వల్ల ముందు జరిగిన విషయం అంతా తెలిసే చేసుకుని ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఝాన్సీ మాత్రం వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు లేదు. కొన్నాళ్లు యాంకరింగ్ కు దూరంగా ఉన్నా ఈమధ్య మళ్లీ ఝాన్సీ ఫాంలోకి వచ్చింది. జోగి నాయుడు పెళ్లికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో.. అసలు రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version