పవర్‌ఫుల్ పోలీస్ఆఫీసర్‌గా రాంచరణ్.!

-

రంగస్థలం హిట్ తర్వాత రాం చరణ్ తన కెరియర్ మీద మరింత పట్టు సాధించాడని చెప్పొచ్చు. ఇన్నాళ్లు స్టార్ ఇమేజ్ ఉన్నా దానికి సరిపడినంత నటన కనబరచలేదు అన్న అసంతృప్తి ఉంది. కాని రంగస్థలంతో ఆ డౌట్ కూడా తీర్చేశాడు. చిట్టిబాబుగా ప్రేక్షకుల మనసులను గెలవడమే కాదు బాక్సాఫీస్ రికార్డులను చెరిపేసిన రాం చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్ చిన్నగా చరణ్ పాత్రకు సంబందించిన లీక్ ఇచ్చేసింది. పవర్ ఫుల్ పోలీస్ గా మరోసరి సత్తా చాటాలని చూస్తున్నాడు చరణ్. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి రాం చరణ్ తో మొదటిసారి చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు.

కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జయ జానకి నాయకా సినిమాతో కాస్త వెనుకపడ్డట్టు అనిపించిన బోయపాటి శ్రీను చరణ్ సినిమాతో తన స్టామినా చూపించాలని అనుకుంటున్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ ఎక్సటింగ్ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version