ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకలో ఏదో ఒక హైలైట్ ఉంటుంది.. ఈ సారి కూడా ఆ హైలైట్ ఆనవాయితీ కొనసాగింది. అయితే ఈ ఏడాది ఉత్తమ కాస్ట్యూమ్ అవార్డు ఆ కీర్తిని దక్కించుకొంది. ఓ సూపర్ స్టార్ ఏకంగా నగ్నంగా వేదికపైకి వచ్చి ఈ అవార్డును ప్రకటించారు. అయితే అతడెవరో కాదు రెజ్లర్ జాన్ సీనా..! ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
తనకు వేదికపైకి నగ్నంగా రావడం ఇష్టంలేదని చెప్పిన సీనా పురుషుడి శరీరం జోక్ కాదని అన్నాడు. హాస్ట్ జిమ్మీ అవార్డు ఇవ్వు అంటూ ఓ ఎన్వలప్‌ను అతడి చేతిలో పెట్టి వేదిక వెనక్కి వెళ్లిపోగా ఆ ఎన్వలప్ను అడ్డం పెట్టుకొని జాన్‌సీనా నగ్నంగానే వేదికపైకి వచ్చాడు. అతడిని చూసి అతిథులు పెద్దపెట్టున నవ్వుతూ చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైకి వచ్చిన సీనా ఎన్వలప్‌ను తాను ఓపెన్ చేయలేనని చెప్పగా.. హోస్ట్ జిమ్మీ అక్కడికి వచ్చి నామినేషన్లను ప్రకటించారు. వాటికి సంబంధించిన క్లిప్స్ ప్రదర్శిస్తున్న సమయంలో వేదికపై లైట్లు ఆర్పేయగా ఆ సమయంలో కొందరు సహాయకులు వేగంగా వచ్చి జాన్‌సీనాకు దుస్తులు తొడిగారు. ఆ తర్వాత ‘‘పూర్ థింగ్స్’’ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్ అవార్డును ప్రకటించారు.