సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబుకు గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సిద్ధం సభకు భారీగా ప్రజాస్పందన వచ్చింది. సభకు వచ్చిన ప్రజాదరణను చూసి చంద్రబాబుకు గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చిందన్నారు. సిద్ధం సభకు ఎక్కువ మంది ప్రజలు వచ్చినట్లు గ్రాఫిక్స్‌లో చూపించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రాఫిక్స్ ఆద్యుడు చంద్రబాబే అంటూ విమర్శలు చేశారు మంత్రి కాకాణి. మా కుటుంబం 60 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంది…ఎన్నో సమావేశాలు..సభలు చూసానని వెల్లడించారు.
కానీ సిద్ధం సభకు మా నేతలు ఆడిగినన్ని వాహనాలు ఇవ్వలేకపోయామని..చాలా మంది కి నిరాశ కలిగిందన్నారు. నా జీవితంలో మొదటి సారి ఇలాంటి స్పందనను చూస్తున్నా..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సిద్ధం సభ రికార్డును సృష్టించిందని కొనియాడారు. జగన్ పాలంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. అందుకే ప్రజలు జగన్ కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో తరలి వచ్చారు….టిడిపి కి చెందినవారు కూడా సభకు వచ్చారని వివరించారు. గ్రాఫిక్స్ ద్వారా అధికంగా ప్రజలు వచ్చినట్లు చూపించారని టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు కాకాణి.