జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. కాసేపటి క్రితమే బెంగళూరులో జానీ మాస్టర్ ని పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
ఇక అటు జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు పోలీసులు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీ పై నాన్ బెయిలబుల్ కేస్ ఉందని చెబుతున్నారు. జానీ పై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని.. మాపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఇలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని… పోక్సో చట్టం కూడా యాడ్ చేసామని వెల్లడించారు.