ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ. ఎన్టీఆర్.. సీఎం అంటూ..!

-

యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు.. నటుడిగా.. నాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ శత జయంతి రోజున తెలుగు వారంతా ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు తారలు రాజకీయ ప్రముఖులు అందరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ తమతో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

ఇక ఈరోజు ఉదయమే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాలతో నివాళులు అర్పించి తన తండ్రి శతజయంతి సందర్భంగా బాలయ్య తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతిని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సత్తా చాటారు.. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టమని బాలయ్య తెలిపారు.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాత గారికి నివాళులర్పించారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కాస్త తోపులాట కూడా జరిగింది అభిమానుల తోపులాటలోనే తారక్ నివాళులు అర్పించి వెళ్లే సమయంలో అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి రామకృష్ణ , పురందేశ్వరి , సినీ నటుడు రాజేంద్రప్రసాద్ , కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version