ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ ను ఓడించిన అప్గానిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన అప్గానిస్తాన్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రాహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. దీంతో ఆసీస్ టార్గెట్ 274.
ఇక ఆస్ట్రేలియా బౌలర్ల లో బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు వికెట్లు, ఎల్లిస్, మ్యాక్సివెల్ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారులు 274 పరులుగు చేయాల్సి ఉంది. ఈ వన్డే మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కి వెళ్తుంది. ఓడిన జట్టుకు అవకాశాలు ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ పై వేసినట్టే బౌలింగ్ ఆస్ట్రేలియా పై వేస్తే.. అప్గానిస్తాన్ గెలిచే అవకాశం ఉందని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.