ఆ విషయంలో ఎన్టీఆర్ చెప్పినా వినని కైకాల సత్యనారాయణ..తర్వాత..!!

-

వెండితెరపైన నవరసాలను పండించగల చక్కటి నటుడు కైకాల సత్యనారాయణ. నవరస నటనా సార్వభౌముడిగా పేరు గాంచిన కైకాల..తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న కైకాల బర్త్ డే వేడుకలను ఇటీవల ఆయన ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి నిర్వహించారు. తన సినీ కెరీర్ తొలినాళ్లలో కైకాల చాలా కష్టపడ్డారు. వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వారట. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్..కైకాలకు అండగా నిలిచారు.

తన ప్రతీ సినిమాలో కైకాల సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. అలా కైకాల నటుడిగా తనను తాను నిరూపించుకుని స్టార్ గా ఎదిగారు. ఇక తనకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని, ఇప్పటికీ ఉందని కైకాల చెప్తుంటారు. ఎన్టీఆర్ ఏ విషయం చెప్పినా వినేవారు. కానీ, ఒక్క విషయంలో ఎన్టీఆర్ మాటను కైకాల సత్యనారాయణ వినలేదట. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. ఈ మూవీ షూటింగ్ రోజుల నాడు ఎన్టీఆర్ ఓ ప్రత్యేక నిబంధన పెట్టారట. అదేంటంటే..‘దాన వీర శూర కర్ణ’ పిక్చర్ షూటింగ్ కోసం చాలా మంది ఆర్టిస్టుల డేట్స్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇందులో నటించే నటీనటులు ఎవరూ కూడా వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వొద్దని చెప్పారట. ప్యారలల్ గా ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ ‘కురుక్షేత్రం’ మూవీ చేస్తున్నారు.

ఎన్టీఆర్ పెట్టిన కండీషన్స్ ను అందరూ పాటించడానికి రెడీ అయిపోయారు. ‘దాన వీర శూర కర్ణ’ షూటింగ్ ఉన్నంత కాలం నటీనటులు మాంసాహారం కూడా తినొద్దని షరుతు విధించారు. అయితే, ఈ షరతుకు మాధ‌వ రంగారావు అంగీకరించలేదు. దాంతో అర్జునుడి పాత్రకు నందమూరి హరికృష్ణను తీసుకున్నారు. ఇక అదే టైమ్ లో కైకాల ‘దాన వీర శూర కర్ణ’లో నటించాలా? వద్దా? అని అయోమయంలో ఉన్నారు.

కైకాల సత్యనారాయణకు ‘కురుక్షేత్రం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్..కైకాలకు..వెసులు బాటు ఇచ్చారు. దాంతో కైకాల రెండు సినిమాల్లో నటించారు. అలా ఎన్టీఆర్ పెట్టిన కండీషన్ ను కైకాల బ్రేక్ చేశాడు. అయితే, ‘దాన వీర శూర కర్ణ’ పిక్చర్ ముందర ‘కురుక్షేత్రం’ నిలబడలేకపోయింది. ‘దాన వీర శూర కర్ణ’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ వస్తే చాలు..జనాలు హాయిగా సినిమాను చూసేస్తుంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version