సమంత, తమన్నాలపై కాజల్ హాట్ కామెంట్స్

-

 

 

ప్రముఖ బ్యూటీ చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది హీరోలతో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న కాజల్ అగర్వాల్ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అందరిని మరింతగా ఆకట్టుకుంది. ఇక చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా తనను సమంత, తమన్నాలపై హాట్ కామెంట్స్ చేశారు.

భర్త గౌతమ్ కిచ్లు చిన్నపిల్లలా చూసుకుంటాడని, పెళ్లి వల్ల అమ్మానాన్నలకు దూరం అయ్యాను అనే ఫీలింగ్ రానివ్వడని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇండస్ట్రీలో సమంత, తమన్నాతో క్లోజ్ గా ఉంటానని, వారితోనే చాలా విషయాలు షేర్ చేసుకుంటానని వెల్లడించారు. కొడుకు నైల్ కిచ్లు ఇచ్చిన మాతృత్వపు అనుభూతిని మాటల్లో చెప్పలేనని వివరించారు. ఇక, కాజల్ ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరిలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news