ప్రమాద బారిన పడ్డ కాజోల్.. ఆందోళనలో ఫ్యాన్స్.!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది యువతను ఆకట్టుకున్న ఈమె ఇప్పటికీ కూడా తన అందంతో అంతే మెస్మరైజ్ చేస్తోంది. ఇక హీరోయిన్ గా ఫేడౌట్ అయినా సరే లీడ్ రోల్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన రూటు మొత్తం మార్చేసిందని చెప్పవచ్చు. ఒక బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు ఈ ముద్దుగుమ్మకు. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టిన ఈమె.. వెబ్ సిరీస్ ల పైన ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని ది ట్రయల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో లాయర్ నోయోనికాసేన్ గుప్తా అనే పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కి హిందీ రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది. ఇండియన్ వెర్షన్ కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేసి దీనిని తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో భర్త చేతిలో మోసపోయిన ఒక లాయర్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొంది అనే కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

ఇదిలా ఉండగా తాజాగా కాజోల్ ని అలాంటి పరిస్థితుల్లో చూసి అభిమానులు కంగారుపడుతున్నారు. ఆమె ఒక చేతి కర్రతో నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేతి కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె కాలికి గాయం అయినట్లు ఆ కారణం చేతనే కర్ర సహాయంతో కారు వద్దకు నడుచుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version