‘కల్కి’ టికెట్​ బుకింగ్స్ .. ఫ్యాన్స్​కు షాక్​!

-

ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి మూవీ మేనియానే కనిపిస్తోంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ జూన్‌27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆదివారం(జూన్ 23) సాయంత్రం నుంచి తెలంగాణలో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అయితే ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకుందామనుకున్న అభిమానులకు చిన్న షాక్ తగిలింది. అదేంటంటే ?

బుక్‌మై షో, పేటీఎం, జస్ట్‌ టికెట్స్‌ వంటి యాప్​లలో ఆడియెన్స్​ టికెట్స్​ బుక్​ చేస్తున్నారు. అయితే బుక్‌ మై షోలో కల్కి 2898 ఏడీ టికెట్‌ను బుక్‌ చేసుకుంటే రాజశేఖర్‌, ప్రశాంత్‌ వర్మ కాంబోలో గతంలో వచ్చిన కల్కి మూవీకి టికెట్‌ బుక్ అయినట్లు కనిపిస్తోందట. టికెట్‌ను త్వరగా బుక్‌ చేయాలన్న ఆలోచనలో ఫ్యాన్స్ ​ దాన్ని గమనించకుండా.. మనీ ట్రాన్​సెక్షన్​ పూర్తైన తర్వాత టికెట్‌ డౌన్‌లోడ్‌ చేయగా, దానిపై రాజశేఖర్‌ కల్కి పోస్టర్‌ కనిపించడంతో షాకవుతున్నారు.

ఇదే విషయమై ఎక్స్‌ వేదికగా బుక్‌ మై షోకు పోస్ట్ పెట్టగా ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభాస్ కల్కికే టికెట్​ బుక్ అయిందని, సాంకేతిక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టత ఇచ్చింది. దీంతో టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version