భైరవ ర్యాంపేజ్.. రూ. 700 కోట్లు దాటిన కల్కి కలెక్షన్స్

-

బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ ర్యాంపేజ్ నడుస్తోంది. కలెక్షన్స్‌ విషయంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సునామీ సృష్టిస్తోంది. వసూళ్లలో ఈ చిత్రం మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 700 కోట్లకుపైగా వసూళ్లు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్‌ను హైలైట్‌ చేయడం విశేషం.

ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా విడుదలై వారం గడుస్తున్నా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్గా నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కల్కి సినిమాపై మీమ్స్ మామూలుగా ఉండట్లేదు. ఎక్కడ చూసినా ఆలస్యమైందా ఆచార్య పుత్రా అంటూ మీమ్స్, డైలాగ్స్, రీల్స్ హవా చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version