ఓవర్సీస్లో కల్కి జోరు.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్

-

పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జూన్ 27న రిలీజైన సినిమాకు హిట్ రావడం వల్ల వీకెండ్లో థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరిగింది. ఓపెనింగ్ రోజే రూ.191.50 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు సమాచారం. దీంతో కల్కి రూ.500+ కోట్లు వసూల్ చేసిన ఐదో తెలుగు సినిమాగా నిలిచింది.

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డుల బౌండరీలు దాటుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా అటు ఓవర్సీస్లోనూ జోరు సాగిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఫస్ట్ వీకెండ్ నార్త్ అమెరికాలో కల్కి మూవీ 11+ మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. అక్కడ తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్లో టాప్ 2 సినిమాలు (కల్కి, బాహుబలి 2) ప్రభాస్వే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version