కొత్త న్యాయచట్టాల్లో 90% కాపీ పేస్ట్.. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు

-

గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రతిపక్షాలు కొత్త చట్టాలను బలవంతంగా అమల్లోకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. నేటినుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం అని పేర్కొన్నారు. కానీ, భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్‌ న్యాయం’ ఆధిపత్యాన్ని ‘ఇండియా’ కూటమి ఆమోదించబోదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారని ఖర్గే విమర్శించారు.

మరోవైపు మరోవైపు కొత్త న్యాయచట్టాల్లో 90-99 శాతం పాత వాటినుంచి కాపీ కొట్టారని సీనియర్ కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం అన్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో మెరుగులుదిద్దినప్పటికీ.. వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version