ఆ తెలుగు నిర్మాత చేతుల్లో రజిని ‘పెట్ట’

-

సూపర్ స్టార్ రజినికాంత్ 2.ఓ ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుండంగా మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా పెట్ట. కోలీవుడ్ లో సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అసలు ఈ సినిమాను తెలుగులో ఎవరు కొంటున్నారు అన్న విషయం మీద కూడా చర్చలు జరిగాయి.

అయితే సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ పెట్ట తెలుగు రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్సీ ప్రైజ్ కే కళ్యాణ్ ఈ హక్కులు సొంతం చేసుకున్నారట. అయితే పెట్ట తెలుగు వర్షన్ మాత్రం సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తుండగా వీరితో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్-2 కూడా వస్తుంది.

ఈ సినిమాల పోటీలో రజిని వచ్చినా థియేటర్ల దొరకడం కష్టమని భావించి తమిళ వర్షన్ రిలీజైనా సరే తెలుగు వర్షన్ కు కాస్త టైం తీసుకుంటున్నారట. మరి పెట్ట తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version