కన్నడ భామను దించుతున్న శేఖర్ కమ్ముల..!

-

సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఫిదా వచ్చి ఏడాది గడుస్తున్న టైంలో శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ ఫైనల్ చేశాడట. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొడుకు హీరోగా ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామని దించుతున్నాడట శేఖర్ కమ్ముల. అమృత అయ్యర్ శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా కన్ఫాం అయ్యిందట.

కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న అమృత అయ్యర్ తమిళంలో విజయ్ ఆంటోని కాళి సినిమాలో నటించింది. అంతా కొత్త వాళ్లతో చేస్తున్న ఈ ప్రయత్నం మళ్లీ శేఖర్ కమ్ములకు హ్యాపీడేస్ ఇచ్చిన ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. ఫిదా హిట్ తర్వాత అవకాశాలు చాలా వచ్చినా తనకు నచ్చిన సినిమా చేసే ప్రొడ్యూసర్ తోనే సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ఫైనల్ గా తన తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version