మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు మనసు గెలిచాడు. ఇంతకీ ఈ మెగా హీరో ఏం చేశాడు అంటే తన పుట్టినరోజైన ఈరోజు ట్విట్టర్ లో అడుగుపెట్టడమే కాకుండా తన అవయవ దానానికి సైన్ చేసి ఆ విషయాన్ని మొదటి పోస్ట్ గా ట్విట్టర్ లో పెట్టాడు. మెగా హీరో చేసిన ఈ పనికి అందరు మెచ్చుకుంటున్నారు.
మెగా అల్లుడుగా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాగా వచ్చిన విజేత పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమాకు కథలను వింటున్నాడు. ఆల్రెడీ ఒక కథ లాక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబందించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. మెగా హీరో అవయవ దానం చేయడం గురించి మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ దేవ్ ను ప్రశంసిస్తున్నారు.