పార్ట్ 2 లో ఎన్టీఆర్ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

-

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తాజాగా బింబి సార సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తుండగా కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే బింబిసారా సీక్వెల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ బింబిసార 2 లో తారక్ నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక అందరిలా నేను చందమామ కథలను వింటూ.. చదువుతూ.. పెరగానని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఇకపోతే ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన సినిమాలను చూసి తాను ఆనందించే వాడిని అని ఆయన తెలిపారు. ముఖ్యంగా సోషియో ఫాంటసీ సినిమాలలో నటించే అవకాశం వస్తే బాగుంటుందని అనుకునేవాడినని ఆయన తెలిపారు. ప్రస్తుతం నా కలను నిజం చేసిన డైరెక్టర్ వశిష్టకు కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఇక ప్రొడ్యూసర్ హరి ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను ఒక రేంజ్ లో రూపొందించారు అని కళ్యాణ్ రామ్ తెలిపారు. ముఖ్యంగా అద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు అని. బింబిసారా కథను రెండు భాగాలను చెప్పాలని ముందే అనుకున్నామని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి ఒకటి కంటే ఎక్కువ సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నామని కళ్యాణ్ రామ్ వెల్లడించడం బాగా ఆసక్తికరంగా మారింది.అంతేకాదు టీజర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది మగధీర సినిమాతో మరికొంతమంది బాహుబలి సినిమాతో పోల్చడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగు వాళ్ళకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాని అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news