అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ రామ్ జెఠ్మ‌లానీ మ‌నుమ‌రాలే

-

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న్యాయ‌వాదుల్లో ఒక‌రైన ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ (95) కన్నుమూశారు. వాజ్‌పేయ్ ప్ర‌భుత్వంలో న్యాయ‌శాఖా మంత్రిగా ప‌నిచేసినాయ‌న గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గా పనిచేశారు.

Kamna Jethmalani Family Background Details

దేశంలో పేరెన్నిక గల న్యాయవాదుల్లో ఒకరైన జెఠ్మలానీ.. 1923 సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు. ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఆయనకు సినీ రంగంతోనూ పరిచయాలున్నాయి. ఇక ఆయ‌న మ‌నుమ‌రాలు తెలుగులో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన కామ్న జెఠ్మ‌లాని రామ్‌కు స్వ‌యానా మ‌నుమ‌రాలు.

తెలుగులో ‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు’, ‘కత్తి కాంతారావు’, ‘జగద్గురు ఆదిశంకర’ వంటి చిత్రాలలో నటించింది. కామ్న మంచి ప్ర‌తిభావంత‌మైన న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లలేక‌పోయింది. అల్ల‌రి న‌రేష్‌తో ఆమె న‌టించిన క‌త్తి కాంతారావు – బెండు అప్పారావు రెండు మంచి హిట్ అయ్యాయి. ఇక కామ్న తండ్రి విష‌యానికి వ‌స్తే నిమేష్ జఠ్మలానీ బిజినెస్ మెన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్. కామ్నా జఠ్మలానీ 2014లో బెంగ‌ళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్పాల్ ను వివాహం చేసుకున్నారు. వివాహానాంతరం ఆమె సినిమాలకు దూర‌మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version