బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ప్రస్తుతం తాజాగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ సినిమా ధాకడ్ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో కంగనారనౌత్ నెవర్ బిఫోర్ అనిపించుకునేలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ సరిగ్గా ధాకడ్ సినిమా విడుదలకు ముందు సరికొత్త లగ్జరీ కారు తో చిందులు వేయాలని ప్లాన్ చేయడం చర్చనీయాంశం గా మారింది. వాస్తవానికి కంగనారనౌత్ మెర్సిడెస్-బెంజ్ మే బ్యాక్ S680 కి గర్వించదగిన యజమాని అయ్యింది అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు . ప్రస్తుతం దీని ఖరీదు ఏకంగా 5 కోట్ల రూపాయలు.
ఇక తాజాగా ఈమె ఈ చిత్రంలో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అని చెప్పవచ్చు. ఇక పోతే ప్రస్తుతం భారీ చిత్రాలలో నటించేందుకు ముఖ్యంగా సౌత్ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి కంగన సిద్ధమవుతోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.