అమెజాన్ ప్రైమ్ లో ‘కాంతార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే మాట కాంతార. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భాషని మరిచి అన్ని భాషల వారు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. బ్యానర్.. ప్రొడ్యూసర్.. ఇలా కాంబినేషన్ చూసుకుని సినిమాలకు వెళ్లే వారు కూడా కేవలం కాంతార సినిమా గురించి వచ్చిన మౌత్ టాక్ తో ఈ చిత్రం చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. 
కంటెంట్ ఉన్న సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదని ‘కాంతార’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాని థియేటర్స్‌లో చూడలేకపోతున్న ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా అని ఎదురుచూస్తున్న వాళ్లకి ఓ గుడ్ న్యూస్.
నవంబర్ 4 శుక్రవారం నాడు ‘కాంతార’ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’‌లో రిలీజ్ చేశారు. అరవింద్‌కి ‘ఆహా’ సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉంది. మరి ‘కాంతార’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా కూడా పంచుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version