మేము ఇంకో బిడ్డకు రెడీగా ఉన్నాం: బాలీవుడ్ క్రేజీ కపుల్

-

బాలీవుడ్ లో క్రేజీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. ఒక పక్క సినిమాలు చేస్తూనే… మరో పక్క వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా లోటు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ఇప్పుడు కెరీర్ లో ఇద్దరూ హై పొజిషన్ లో ఉన్నారు. సైఫ్ మంచి సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటే కరీనా తన కొడుకుతో బిజీగా ఉంటూనే సినిమాలను మంచి గ్యాప్ లో ప్లాన్ చేసుకుని చేస్తూ ఉంటుంది. వారికి మంచి ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి.

2016 లో ఈ భార్యా భర్తలు తల్లి తండ్రులు అయ్యారు. తైమూర్ అనే పిల్లాడికి తల్లి తండ్రులు అయిన ఈ దంపతులు మూడు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తమకు మరో బిడ్డ కావాలని అనుకుంటున్నామని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. తాము అదనంగా తమ కుటుంబంలో మరొకరిని ఆశిస్తున్నామని చెప్పారు. అభిమానుల ప్రేమ, మద్దతు తమకు ఎప్పుడు ఉంటాయి అని చెప్తూ పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version