పెళ్లయ్యాక సైలెంట్ అయిపోయిన కత్రినా.. ఆ సినిమాతోనైనా హీట్ పెంచనుందా!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గత ఏడాది విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పెళ్లి అనంతరం సినిమాలు తగ్గించేసిన కత్రినా మరింత కామ్ అయిపోవటం ఆమె అభిమానులకు అర్థం కాని విషయం గా మారింది.

కత్రినా కైఫ్ పెళ్లికి ముందు నటించిన టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెళ్లి అనంతరం కుర్ర హీరోలతో సినిమాలు చేసినప్పటికీ అవి ఏవి అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. కానీ కత్రినా ధూమ్ 3 సినిమాలో అమీర్ ఖాన్ రేంజ్ స్టార్ తో పోటీపడి నటించింది. టైగర్ సిరీస్ లో సల్మాన్ ఖాన్ తో పోటీపడి నటిస్తోంది. ఇంతటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ పెళ్ళి అయ్యాక సైలెంట్ అయిపోవడం అందరికీ ప్రశ్నగా మారింది.

గత ఏడాది ఎందరో బాలీవుడ్ భామలు పెళ్లి చేసుకున్నారు. అలియా భట్ పెళ్లి చేసుకోవడంతో పాటు ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కెరియర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న ఆలియా, కియరా తో పోలిస్తే కత్రినా వెనకబడిందని చెప్పాలి. ఒకవేళ పెళ్లి తర్వాత తాను రేస్ లో ఉన్నానని నిరూపించాలంటే `టైగర్ 3` రిలీజయ్యే వరకూ వేచి చూడాల్సిందే. అలాగే కత్రిన ప్రస్తుతం సూపర్ గాళ్ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం సాగింది. అలీ అబ్బాస్ జాఫర్ ఇందుకోసం సన్నాహకాల్లో ఉన్నాడన్న ప్రచారం ఉంది. కానీ ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం మరో ప్రశ్న. సల్మాన్ తో పాటు టైగర్ 3లో ధీటైన యాక్షన్ రోల్ పోషిస్తున్న కత్రిన మరోసారి హీట్ పెంచుతుందేమో చూడాలి. ఏది ఏమైనా ముందు ఈ నిశ్శబ్ధానికి చెక్ పెట్టాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version