మహానటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేశ్ సినిమాల్లో దూకుడు పెంచింది. అంతకుముందు సంప్రదాయంగా కనిపించిన కీర్తి సర్కారు వారి పాట తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫొటోషూట్లతో తన హవా కొనసాగిస్తోంది. కీర్తి పాపులారిటీతో బాలీవుడ్ తనకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. అలా దళపతి విజయ్ నటించిన తేరీ రీమేక్గా తెరకెక్కుతోన్న బేబీ జాన్ చిత్రంతో హిందీలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈనె 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు కీర్తి సురేశ్ ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. టాలీవుడ్లో ఈ బ్యూటీ సాధారణంగా ఒక్కో చిత్రానికి కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే తనకున్న క్రేజ్ కారణంగా రెమ్యునరేషన్ డబుల్ చేసిందట. కీర్తి సురేశ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.