లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన ప్రవీణ్ కుమార్ దాదాపు రెండు గంటలపాటు పొత్తు అంశంపై చర్చించారు.
ఈ భేటీ అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కేసీఆర్, ప్రవీణ్ కుమార్ నిర్ణయానికి వచ్చారు. అయితే నిన్న బీఎస్పీ పార్టీతో కలిసిన కేసిఆర్… త్వరలోనే కమ్యూనిస్టు పార్టీలతో కూడా ఏకం కానున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికలలో కం బ్యాక్ కావాలని కెసిఆర్ వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట గులాబీ బాస్. వారికి నల్గొండ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.