మహానటి ఫేం కీర్తి సురేశ్ తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో సూపర్ బిజీగా ఉంది కీర్తి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం కీర్తి హైదరాబాద్, చెన్నై, ముంబయి, కేరళకు చక్కర్లు కొడుతోంది.
తాజాగా కీర్తి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని క్యూట్ వీడియోస్ పోస్టు చేసింది. దసరా సినిమా షూటింగులో తను కొత్తగా కొందరితో స్నేహం చేశానంటూ వారిని పరిచయం చేసింది. ఇంతకీ ఆ స్నేహితులెవరో తెలుసా..?
దసరా సినిమా సెట్ లో కీర్తి.. కోళ్లు, మేకలు, ఆవులు, దూడలతో స్నేహం చేసిందట. మూగజీవాలతో కలిసి సందడి చేస్తున్న వీడియోలు పోస్టు చేసింది. ఈ వీడియో కింద.. దసరా సెట్ లో వెన్నెల చాలా మంది కొత్త స్నేహితులను పరిచయం చేసుకుందంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నేచురల్ స్టార్ నానితో కీర్తి సురేశ్ నటించిన దసరా మూవీ మార్చి 30న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.