ఏపీ అసెంబ్లీ స్పీకర్: ఎక్కడైనా కంప్లైంట్ చేసుకోండి… అది మీహక్కు !

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించిన వార్తలు రెండు మూడు రోజుల నుండి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ను సృష్టించి… లా కోర్స్ చేయడానికి అడ్మినిషన్ పొందారని ఈయన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను వింటూ వచ్చిన సీతారాం తాజాగా తనదైన స్టైల్ లో స్పందించారు.

 

ఈ విషయంపై నేను సమాధానం చెప్పాల్సినప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసని అంటూనే… ఈ విషయం పైన ఎవరైతే గవర్నర్ కు, అలాగే మరికొందరు ముఖ్యమైన వారికి ఫిర్యాదు చేస్తున్నారో వారందరికీ ఒకటే చెబుతున్నా.. మీరు ఎవరికీ అయినా ? ఎక్కడికైనా కంప్లైంట్ చేసుకోండి. ఆ హక్కు మీకు ఉంది అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించాడు. నేను పొరపాటు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అంటూ దైర్యంగా చెప్పారు. మరి ఈ విషయం ఏ విధంగా రుజువు కానుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version