మిస్ ఇండియా సెట్లో కీర్తి చేసిన అల్లరి..

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ ఇండియా చిత్రం నవంబరు 4వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ నేపథ్యంలో మిస్ ఇండియా చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా మిస్ ఇండియా చిత్ర బ్లూపర్స్ విడుదల చేసింది. సెట్లో జరిగిన సన్నివేశాలు, సీన్న్ చేస్తున్నప్పుడు జరిగిన అల్లరి.. మొదలగు వాటిని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసారు. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

కీర్తి చేసిన సందడి మామూలుగా లేదు. డైలాగ్ చెప్పేటప్పుడు తడబడటం, జగపతి బాబు గారు కీర్తిని కరెక్ట్ చేయడం, ఆస్కార్ మీకే ఇవ్వాలంటూ నవీన్ చంద్ర మాట్లాడడం చూస్తుంటే మిస్ ఇండియా సెట్లో చాలా ఎంజాయ్ చేసారని తెలుస్తుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఓటీటీలో విడుదల అవుతున్న కీర్తి రెండవ చిత్రం ఇదే. ఇదివరకే పెంగ్విన్ విడుదలై ప్రేక్షకుల నుండి సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. మరి మిస్ ఇండియా ఏం చేస్తుందో చూడాలి.