అమెరికాలో కొనసాగుతున్న పోలింగ్..జో బైడెన్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్..!

-

హోరాహోరీగా జరుగుతున్న అమెరికా ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి..ముఖ్యంగా వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎంతో ఆసక్తితో చూసున్నాయి..ఈ సారి ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మొదటి నుంచి ఆధిపత్యం చూపిస్తున్నారు..అన్ని సర్వేల్లో జో బైడెన్‌ మధ్య ఓట్‌షేరిగ్‌లో చాలా వ్యత్యాసం కనిపించింది..తాజాగా ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంచలన ప్రకటన చేసింది..డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి నెట్టిందని గూగుల్ పేర్కోంది..జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారని గూగుల్ చెబుతోంది.

అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంతో..ఎన్నికల పోరులో గెలుపు ఎవరిదో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది..ఈ క్రమంలో గూగుల్ కీలక విషయాన్ని వెల్లడించింది.. జో బైడెన్‌ను ట్రంప్ వెనక్కినెట్టినట్టు తెలిపే గణాంకాలను విడుదల చేసింది..ట్రంప్ గురించి గతకొద్ది రోజులుగా అమెరికన్లు ఇంటర్నెట్‌లో తెగ సర్చ్ చేశారని గూగుల్ వివరించింది.. గూగుల్ సర్చ్ డేటా అనాలసిస్ ప్రకారం.. సగటున 45 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ట్రంప్ కోసం వెతికితే.. కేవలం 23 శాతం మంది మాత్రమే బైడెన్ గురించి సెర్చ్ చేశారని గూగుల్ స్పష్టం చేసింది..ఇంటర్నెట్‌లో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లను ఎంత మంది వెతికారో తెలియజేసే గూగుల్ ట్రెండ్స్ గ్రాఫ్‌ను విడుదల చేసింది.. నెబ్రాస్కా, వెర్మోంట్, అరిజోనా, వాషింగ్టన్, ఓరెగాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ట్రంప్ కోసం ఎక్కువగా సర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది..దీంతో అమెరికా ఎన్నికలు ప్రస్తుతం మరింత రసవత్తంగా మారింది..గూగుల్ విడుదల చేసిన ఈ గ్రాఫ్ జరుగుతున్న ఎన్నికలపై చాలా ప్రభావం పడనుంది.. గూగుల్ ప్రకటనతో జో బైడెన్‌కు వచ్చే ఓట్‌ షేర్‌పై ప్రభావం ఉంటుందని రాజకీయ నిపుణులు అంచన వేస్తున్నారు..ఎన్నికల కొనసాగుతున్న తరుణంలో గూగుల్ ప్రకటన విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..జో బైడెన్‌ వర్గం గూగుల్ ప్రకటనపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news