రష్మిక వల్లే..సంధ్య థియేటర్‌ ఘటన – కేతిరెడ్డి

-

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. అల్లు అర్జున్ కోసం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగలేదని తెలిపారు. రష్మిక మందన్న నేషనల్ క్రష్ కాబట్టి.. ఆమె కోసం ఫ్యాన్స్ వెళ్లారని బాంబ్‌ పేల్చారు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి.

Ketireddy Venkatarami Reddy’s sensational comments on the stampede at Sandhya Theatre

రష్మిక వల్లే ఆ ఘటన జరిగింది.. బన్నీ ఏం బాగుంటాడు? అంటూ సెటైర్లు పేల్చారు. దీంతో.. కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్‌ గా మారాయి. కొంపలోని సమస్యలను పక్కన పెట్టి సినిమా వాళ్ల వెంట పోతారని…. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు.. రియల్‌ లైఫ్‌లో కాదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

కమల్‌హాసన్‌ కంటే పవన్‌ కల్యాణ్‌ గొప్ప నటుడేం కాదని చురకలు అంటించారు. కమల్‌హాసన్‌ ఎన్నికల్లో ఓడిపోయాడు. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోటే గెలిచాడన్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. బాలకృష్ణ హిందూపురం కాబట్టి 3 సార్లు గెలిచాడని ఎద్దేవా చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version