కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్నపూర్ణ తెలంగాణ కాస్త ఆత్మహత్యల తెలంగాణ మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం ఉదయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన పేపర్ క్లిప్లింగులను పోస్టు చేశారు.
‘ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్ గారు దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారు.ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారు.హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారు.
పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ గారు రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు.ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇది ప్రజాపాలన కాదు ప్రజలను వేధించే పాలన.జాగో తెలంగాణ జాగో’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.
ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను
పదేళ్ల పాలనతో కేసీఆర్ గారు దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారు
ఏడాది కాంగ్రెస్ పాలనలో
అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారుహైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేశారు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన… pic.twitter.com/Zh38SCSN1H
— KTR (@KTRBRS) February 2, 2025