టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా పూర్తి అయ్యి ఓవర్సీస్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత సంవత్సరం ది ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ కు ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక తాజాగా వచ్చిన కింగ్డమ్ మూవీ ఈనెల 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ మూవీ విజయ్ సక్సెస్ అందుకున్నారో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ : 1920… శ్రీకాకుళం తీర ప్రాంతం. సముద్రం గర్జించే ఒడిదుడుకుల్లో ఓ తెగ జీవిస్తోంది. బ్రిటిష్ పాలకులు తమ వద్ద ఉన్న విలువైన ఖనిజాన్ని లూటీ చేయాలనే ఆశతో దాడి చేయడంతో, ఆ తెగ నాయకుడు తన ప్రజల కోసం ప్రాణాలర్పిస్తాడు. అప్పటి నుంచే… ఆ తెగ తమ నిజమైన నాయకుడి రాకకై ఎదురు చూస్తోంది.ఇక 1991… అంకాపూర్ రైల్వే స్టేషన్. సాదాసీదాగా కనిపించే కానిస్టేబుల్ సూరి(విజయదేవరకొండ ) జీవితంలో అనుకోకుండా మార్పు తెచ్చే మలుపు వస్తుంది అదే ఇండియన్ స్పై ఏజెన్సీ నుంచి వచ్చిన ఓ మిషన్ అతని చేతుల్లోకి రావటం.
అతను దీన్ని అంగీకరించడానికి ఉన్న అసలు కారణం? తనకు బాల్యంలోనే దూరమైన అన్నయ్య శివ (సత్యదేవ్) ఆ మిషన్ ప్రాంతంలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో సూరి ఆ ఊరికి చేరుకుంటాడు. అక్కడి పరిస్థితులు చూస్తే షాక్. ప్రజలు న్యాయం కోసం పోరాడుతూ, పాత జ్ఞాపకాల్లో బ్రతుకుతున్నారు. తాను అక్కడికి రావడం యాదృచ్ఛికమా? లేక అది అతని విధి భాగమా?తన అన్నయ్యను వెనక్కి తీసుకురాగలిగాడా? ఆ ప్రజలు ఎవరూ? ఆ తెగ కోరిక ఏమిటి? సూరి ఎలా మారాడు?ఈ అన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే… “కింగ్డమ్” అనే ఈ యాక్షన్, ఎమోషన్,మూవీ ను మీరు తప్పక చూడాల్సిందే.
కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందని, అన్నదమ్ముల అనుబంధాన్ని అద్భుతంగా చూపించాలని చెబుతున్నారు. సినిమా కోసం అనిరుద్ సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది. గౌతం తిన్ననూరి అద్భుతమైన స్టోరీ లైన్ తో ఈ సినిమా తలకెక్కించిన విధానం విజయ్ నటన సినిమాకి ప్లస్ పాయింట్స్ గాని ఉన్నాయి. కింగ్డమ్ టైటిల్ కార్డు నుంచి సినిమా అధ్యంతం ఫ్యాన్స్ ని కాక కామన్ ప్రేక్షకుల్ని కూడా, అలరిస్తుందని చెబుతున్నారు. సినిమా స్టోరీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఖచ్చితమైన స్టోరీ లైన్ మీద డ్రామా నడిచిందని, సగటు ప్రేక్షకుడి అభిప్రాయపడుతున్నాడు.
నటీనటులు: విజయ్ దేవరకొండ,భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్,అయ్యప్ప పి శర్మ వెంకటేశ్, రాజకుమార్ కసిరెడ్డి, మహేష్,తదితరులు నటించారు.
సంగీతం: అనిరుద్
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: గౌతం తిన్న నూరి
విడుదల: 31-7-2025
ఎలా వుందంటే: అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథ. ఓ గ్యాంగ్స్టర్ డ్రామ తెలుగులో ఇలాంటి కథలు చాలా నే వచ్చాయి. కానీ వాటితో పోలిస్తే ఇందులో ఇద్దరు అన్నదమ్ముల బంధం.ఒక ప్రాంతంలో చిక్కుకుపోయిన తెగకు చెందిన నేపథ్యం మూవీలో కొత్తగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్: విజయదేవరకొండ నటన,ఈ సినిమా కథ బలంగా నిలిచింది. మంచి విజువల్స్, బలాన్ని ఇచ్చే సంగీతం,ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
బలహీనతలు: లోపించిన భావోద్వేగలు.కథ లో కొత్తదనం లోపించటం.
రేటింగ్:3/5
గమనిక: (ఈ సమీక్షకేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే )