Speaker Gaddam Prasad: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రియాక్ట్ అయ్యారు.

కోర్టు తీర్పు కాపీ ఇంకా చూడలేదు చూసిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాము. సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులను సంప్రదించి అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.