వర్షాకాలం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము తెచ్చినప్పటికీ ఎక్కువ తేమా వాతావరణం వల్ల కొన్ని సమస్యలు దారి తీయవచ్చు. ఈ సమయంలో ధరించే బట్టలు చర్మ ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. తడి బట్టలు చర్మ అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని దురద వంటి సమస్యలను తెస్తాయి. వర్షాకాలంలో చర్మ సమస్యలు నివారించడానికి ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
కాటన్ లైట్ వెయిట్ : వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా బట్టలు తడిస్తే వెంటనే ఆరడానికి కాటన్ లైట్ వెయిట్ క్లాత్ సూట్ అవుతుంది ఇవి తొందరగా ఆరిపోతాయి.వెయిట్ లెస్ గా ఉండి కంఫర్టబుల్ గా ఉంటాయి.
సింథటిక్ క్లోత్ : ఎక్కువగా ఆటల్లో ఉపయోగించే డై ఫిట్ లేదా మాయిశ్చరైజింగ్ మేకింగ్ ఫ్యాబ్రిక్ వంటి అధునాతన సింథటిక్ బట్టలను వాడటం వాళ్ళ తడి త్వరగా పిల్చేస్తాయి. వర్షంలో తడిసినప్పుడు ఇవి శరీరంపై తేమని ఎక్కువసేపు నిలవనివ్వవు, తొందరగా డ్రై అయిపోతాయి అందుకే ఈ బట్టలు వర్షాకాలంలో ఎక్కువ మంది లైక్ చేస్తారు
వర్షాకాలంలో కొన్ని బట్టలు చర్మ సమస్యలను పెంచుతాయి అలాంటి బట్టలను వేసుకోకుండా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు..
మందంగా ఉండే గట్టి క్లాత్ : జీన్స్ మందమైనా ఫ్యాబ్రిక్, పాలిస్టర్ బట్టలను వర్షాకాలంలో వాడకుండా ఉండడం మంచిది. తడిచినప్పుడు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి చర్మం పై రాపిడికి గురైనప్పుడు దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణం అవుతాయి.
ముదురు రంగు బట్టలు : మధురంగు బట్టలు దోమలను ఆకర్షిస్తాయి. ఇవి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి అందుకే వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కావున ఈ రకం బట్టలకు దూరంగా ఉంటే మంచిది
సిల్కు-ఉన్ని బట్టలు : సిల్క్ ఉన్ని బట్టలు తేమని ఎక్కువగా లాక్ చేస్తాయి. ఆరాటనికి చాలా టైం పడుతుంది అవి చర్మం పైన దురదను పెంచుతాయి.
వర్షాకాలంలో చర్మ సమస్యల బారిన పడకుండా ఉండడానికి తడి బట్టలను వెంటనే మార్చుకోవడం, చెప్పులు తడిచినప్పుడు వాటిలో ఎక్కువ ఫంగస్ చేరుతుంది కావున ఆరిన షూస్ ని చెప్పులని ధరించడం. చర్మం జిడ్డుగా ఉంటే తేలికైన నాన్-గ్రీజీ మాయిశ్చరైజర్ ని వాడడం రోజుకు రెండుసార్లు స్నానం చేయడం వంటివి చేయడం వలన చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.