సమంతపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్ వైరల్!

-

సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెను కార్నర్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ‘X’వేదికగా మంత్రిపై విమర్శలు గుప్పించారు. ‘టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబాన్ని అత్యంత భయంకరంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు తాను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునేందుకు మధ్యలో ‘ది మోస్ట్ రెస్పెక్టెడ్’ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం ఏమాత్రం భరించకూడని విషయం.

కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో తనకు అర్థం కావడం లేదు.రఘునందన్ రావు విషయంలో ఎవరో అవమానించారని, అసలు ఆ విషయంతో సంబంధం లేని నాగార్జున,నాగ చైతన్యలను అవమానించడం ఏంటి? ఫోర్త్ గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు, తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పడం దారుణం.ఒక మంత్రి హోదాలో ఉండి ఓ డిగ్నిఫైడ్ కుటుంబాన్ని,సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగిన ఒక మహానటి మీద అత్యంత నీచమైన మాటలను ఖండించాలి’ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news