ప్ర‌భాస్ కు జోడీగా కొరియ‌న్ హీరోయిన్ ?

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌ర‌స సినిమా లో బిజీ గా ఉంటుంన్నారు. ఇప్ప‌టికే మూడు సినిమాల షూటింగ్ ల‌తో బిజీ ఉన్నాడు. అలాగే త‌న 25 వ సినిమా కు కూడా అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా కు అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట‌ర్ గా ఉంటున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా కు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటీల్ స్పిరిట్ అని ఇటీవ‌ల చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమా కు సంబంధించి ఒక ఆస‌క్తి క‌ర‌మైన వార్త సోష‌ల్ మీడియాలో ఫీల్మ్ న‌గ‌ర్ లో తెగ చెక్క‌ర్లు కొడుతుంది.

అది ఎంటి అంటేఈ ఈ స్పిరిట్ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు జోడీ కొరియ‌న్ భామ ఆడి పాడ‌నుంద‌ని సమాచారం. అయితే ఈ వార్త గురించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాకున్న‌.. ఇదే నిజం అని చిత్ర పూరిలో ప‌లువురు అంటున్నారు. సౌత్ కొరియా లో ప‌లు టీవీ షో ల‌తో క్రేజ్ తెచ్చు కున్న సాంగ్ హై క్యో ఈ స్పీరిట్ సినిమా కు హీరోయిన గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ప్ర‌భాస్ బ‌హుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రెంజ్ అంత‌ర్జాతీయ స్థాయి కి పెరిగి పోయింది.

 

ఈ సినిమా త‌ర్వ‌తే ప్ర‌భాస్ అన్ని కూడా పాన్ ఇండియా లెవ‌ల్ సినిమాలు తీస్తున్నారు. అలాగే ఈ స్పీరిట్ సినిమా కూడా పాన్ ఇండియా రెంజ్ లోనే ఉంటుంది. అయితే ఈ సినిమా లో ఇంట‌ర్నెష‌నల్ స్టార్స్ న‌టించ‌డం తో ఈ సినిమా అంత‌ర్జాతీయం గా కూడా గుర్తింపు తెచ్చుకునే అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news