Kuberaa OTT: స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. కుబేర సినిమా రెండు వారాల కిందట థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అత్యంత ధనవంతుడు ఏమి ఆశించని బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర సినిమా కథ. బిచ్చగాడి పాత్రలో హీరో ధనుష్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో అద్భుతంగా నటించారు.

హీరో నాగార్జున, నటి రష్మికలు పాత్రలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. కుబేర సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాల మధ్య సినిమా అద్భుతంగా ఉంది. కుబేర సినిమాకు డిఎస్పి సంగీతం అందించారు. అయితే ఈ మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే జూలై 18వ తేదీ నుంచి ఈ సినిమాను చూడవచ్చు.