రాజాసింగ్ కు బిగ్ షాక్ తగిలింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ పార్టీ. ఈ మేరకు రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెల జూన్ 30న రాజీనామా చేసిన రాజాసింగ్… బీజేపీ పార్టీ పై విమర్శలు కూడా చేశారు. ఈ తరుణంలోనే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ పార్టీ. ఇక అటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్… గులాబీ గూటికి వెళుతున్నారని సమాచారం అందుతోంది. జనసేన లోకి వెళతారని అంటున్నారు.
- రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
- రాజీనామాను ఆమోదించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెల జూన్ 30న రాజీనామా చేసిన రాజాసింగ్