F3 Movie : ఎఫ్‌ 3 నుంచి బిగ్‌ అప్డేట్‌..”లబ్‌ డబ్‌” సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.

ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయి….విడుదలకు రెడీగా ఉంది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3 సినిమా నుంచి ఓ బిగ్‌ అప్ డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి లబ్ డబ్‌ లబ్‌ డబ్‌ అంటూ సాగే.. పాట ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ విభిన్న గెటప్‌ లో.. చాలా జోష్‌ లో కనిపించారు. ఇక పూర్తి పాటను రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version