Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి బేబీ బంప్ తో మొదటిసారిగా కనిపించారు. వివాహం జరిగిన సంవత్సరం తర్వాత లావణ్య ప్రెగ్నెంట్ అని తన అభిమానులకు స్పష్టం చేశారు. హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి మాల్దీవ్స్ టూర్ కు వెళ్లారు.

అక్కడ వీరు బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో లావణ్య త్రిపాఠి దేవి బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కాగా, లావణ్య త్రిపాఠి వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించిన లావణ్య త్రిపాఠి తల్లి కావడంతో తన అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు.