ఆర్ఆర్ఆర్ లీక్డ్ ఫోటోల వెనుక అసలు నిజం ఇదే….!!

-

బాహుబలి రెండు భాగాలతో తన ఇమేజిని అమాంతం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి పెంచుకున్న దర్శకధీరుడు రాజమౌళి, ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ లతో కలిసి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్. చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి యూనిట్ నుండి ఎటువంటి అధికారిక పోస్టర్ కానీ అప్ డేట్ కానీ రాకపోవడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు.

అయితే అనూహ్యంగా నిన్న ఈ సినిమా నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్స్ కొందరు లీక్ చేసినట్లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ విషయం వెంటనే పసిగట్టిన ఆర్ఆర్ఆర్ టీమ్, అప్రమత్తం అవడంతో పాటు వాటి మూలలను పూర్తిగా డిలీట్ చేయించడం జరిగిందట. అలానే ఇకపై షూటింగ్ జరిగే సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారట.

అయితే లీక్ అయిన ఆ పిక్స్ మాత్రం ఎక్కడా కూడా బయటకు వచ్చినట్లు లేదు,
అయితే ఆ సినిమాలో హీరోలిద్దరి లుక్స్ ఇవే అంటూ కొన్ని ఫ్యాన్ మేడ్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఇది మంచి పద్ధతి కాదని, కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే, ఈ విధంగా తప్పుడు పద్ధతుల్లో వాటిని లీక్ చేయడం వంటివి చేయొద్దని కొందరు సినీ విశ్లేషకులు కోరుతున్నారు. నిన్నటి నుండి ఈ మ్యాటర్ పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version