అయోధ్య కేసు తీర్పు సమయంలో భారత నెటిజన్లు గూగుల్‌లో ఏం వెతికారో తెలుసా..?

-

అయోధ్య తీర్పు కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం ఓ ఎత్తయితే.. నెటిజన్లు ఆ చారిత్రాత్మక సందర్భం నేపథ్యంలో గూగుల్‌లో పలు అంశాలపై విస్తృతంగా సెర్చ్ చేశారు.

అయోధ్యలో ఉన్న వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం రామ జన్మభూమే అని సుప్రీం కోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం విదితమే. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు సుప్రీం కోర్టు తన తీర్పుతో ముగింపు పలికింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌తో కలిపి ఐదుగురు జడ్జిలు సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం హిందూ సంస్థలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అలాగే ముస్లిం సంస్థలకు అయోధ్యలోనే బాబ్రీ మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే అయోధ్య తీర్పు కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం ఓ ఎత్తయితే.. నెటిజన్లు ఆ చారిత్రాత్మక సందర్భం నేపథ్యంలో గూగుల్‌లో పలు అంశాలపై విస్తృతంగా సెర్చ్ చేశారు. ఆ అంశాలు ఏమిటంటే…

అయోధ్య కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో భారత్‌లోని నెటిజన్లు అనేక అంశాలపై గూగుల్‌లో సెర్చ్ చేయగా.. వాటిల్లో.. సెక్షన్ 144 అంటే ఏమిటి, సెక్షన్ 144 ఇన్ బెంగళూర్, స్కూల్ హాలిడే, సెక్షన్ 144, అయోధ్య వర్డిక్ట్, ఈజ్ టుమారో ఎ హాలిడే, స్కూల్ హాలిడే, అయోధ్య వర్డిక్ట్ హాలిడే, కర్‌ఫ్యూ, వాట్ ఈజ్ సెక్షన్ 144 ఇన్ అయోధ్య, వాట్ ఈజ్ అయోధ్య కేస్, రంజన్ గొగొయ్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్, సుప్రీమ్ కోర్ట్, అయోధ్య కేస్, రంజన్ గొగొయ్ రెలిజియన్, అయోధ్య డిస్‌ప్యూట్, బాబ్రీ మసీదు.. తదితర అంశాలను నెటిజన్లు గూగుల్‌లో వెతికారని వెల్లడైంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version