Most Eligible Bachelor:యూట్యూబ్ లో దుమ్ముదులుపుతున్న లెహరాయీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే..

-

Most Eligible Bachelor: కింగ్ నాగ్ న‌టవార‌సుడు అఖిల్ అక్కినేని.. టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజ హెగ్డే జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు అఖిల్ కెరీర్‏లో సరైన హిట్ పడలేదు. ఎలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. కాగా.. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుద‌లైన లెహరాయి లిరికల్ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు 6 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ 4లో ట్రెండ్ అవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్ కూడా యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. మొత్తం 5 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని.. ఇది ట్రైల‌ర్ కూడా ట్రెండింగ్ లో ఉంది. గోపిసుందర్‌ సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన బాణీలకు త‌గ్గ‌ట్టుగా రచయిత శ్రీమణి ఏ లేలేలే.. లేలేలేలే.. లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి.. అనే పాట ర‌చ‌న చాలా బాగుంది. ఈ పాట‌కు సిద్‌ గాత్రం అందించడం వల్ల ఎంతో మంది హృదయాలకు ఈ పాట చేరువైంది. ఇక‌ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version