Actor Vijay: హీరో విజయ్ కి ఎన్నికల సంఘం నుంచి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఈ మేరకు హీరో విజయ్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. రాజకీయ పార్టీగా గుర్తింపు పోందింది హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ. ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు హీరో విజయ్.
అయితే… ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పార్టీకి లభించిందని తాజాగా ప్రకటించారు విజయ్. ఇక తమిళనాడును అభివృద్ధి పథంలో విజయపథంలో ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం అంటూ లేక విడుదల చేశారు విజయ్. త్వరలోనే భారీ సభతో పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానని కూడా వెల్లడించారు. కాగా.. హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ గుర్తులో ఏనుగు బొమ్మ ఉందని.. సమాజ్ వాది పార్టీ అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే.. వారి నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.