వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు సంతోషాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆ తర్వాత హీరో ఎదిగే విధానం, డబ్బు సంపాదించే సీక్రెట్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అయిపోయింది.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ధనుష్ తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని వెల్లడించారు. కాగా గత సంవత్సరం ఓటీటీలో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను కేవలం రూ. 56 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. త్వరలోనే లక్కీ భాస్కర్ సినిమాకు సీక్వెల్ తీస్తామని స్పష్టం చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీక్వెల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.