ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవుల పైన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయి అంటూ స్పష్టం చేశారు. ఇవి స్కూళ్లు మొత్తానికి ఇచ్చేందుకు ఆప్షనల్ సెలవులు కాదని వెల్లడించారు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లుగా తెలిసిందని అన్నారు.

ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో కనిపించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కాగా మరోవైపు ఏపీలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాత పరీక్షల ఆధారంగా పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో పరీక్షలు రాసేవారు ప్రిపేర్ అవుతున్నారు.