NITHIIN31 : “మాచర్ల నియోజకవర్గం” నుంచి పోటీకి దిగుతున్న నితిన్

-

టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం నితిన్… హీరోగా మాస్ట్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో లో భారీ విజయాన్ని అందుకున్న అంధాదున్ సినిమాకు రీమేక్ గా మాస్ట్రో సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా విడుదల కాకముందే.. తన 31 వ సినిమాను ప్రారంభిస్తున్నాడు నితిన్. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసింది. “మాచర్ల నియోజకవర్గం” అనే డిఫరెంట్ పొలిటికల్ టైటిల్ ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఈ  టైటిల్ చూస్తుంటే.. సినిమా స్టోరీ మొత్తం రాజకీయ నేపథ్యం లో నడిచేలా కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version